Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బయ్యారం
శాంతి భద్రతల పరిరక్షణ కోసమే కార్డన్ సెర్చ్ నిర్వహి స్తున్నట్లు డీఎస్పీ సదయ్య అన్నారు. మండలంలోని వెంకట్రాంపురంలో ఉదయం 4 గంటల నుంచే పోలీసు బలగాలను గ్రామంలో మోహరించారు. ఇంటింటా సోదా లు నిర్వహించారు. దీంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు. ద్విచక్ర వాహన పత్రాలు, ఆధార్ కార్డులను పరిశీలించారు. అనం తరం ఏర్పాటు చేసిన సమావేశంలో డీఎస్పీ మాట్లాడుతూ ప్రజల సంక్షేమం, రక్షణ కోసమే పోలీసులు అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. మండలంలో అసాంఘిక కార్యక లాపాలు సాగించే అవకాశం లేకుండా నిఘా ఏర్పాటు చేసి, చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కార్డన్సెర్చ్లో రూ.50వేల నగదు, 30 లీటర్ల సారా, 200 లీటర్ల పాన కం, 50 కేజీల బెల్లం, 30 బైకులు, 1 ఆటో స్వాధీన పర చుకున్నట్లు తెలిపారు. తనిఖీల్లో గార్ల బయ్యారం సిఐ బాలాజీ, ఎస్ఐ రమాదేవి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.