Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి
నవతెలంగాణ-నల్లబెల్లి
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా శనివారం నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మండలంలోని ముచింపులతండా, నందిగామ, నల్లబెల్లి, కొండైలుపల్లి తదితర మొత్తం 16 గ్రామాలలోని పాఠశాలలో మొదటి విడత అభివద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం విద్య, వైద్యానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని ప్రతి పేదవాడికి గుణాత్మకమైన, నాణ్యమైన విద్య అందించాలనే సంకల్పంతో కెసిఆర్ ప్రభుత్వం పని చేస్తున్నా డని అన్నాడు. మండలంలోని పాఠశాలలో విద్యార్థుల సం ఖ్యను బట్టి మొదటి ప్రాధాన్యతగా మన ఊరు మన బడి కార్యక్రమానికి పాఠశాలలు ఎన్నిక కాబడ్డాయి అన్నారు. పాఠశాల చుట్టూ ప్రహరీ, అదనపు తరగతి గదులు, మంచి నీటి సౌకర్యం, పాఠశాలలో గార్డెన్, ప్రతి తరగతి గదిలో ఫ్యాన్లు, విద్యుత్ బల్బులు, విజ్ఞానాన్ని పెంచే విధంగా పాఠశాల కోడలపై చిత్ర పటాలు, అబ్బాయిలకు, అమ్మాయి లకు వేర్వేరు మూత్రశాలలు నిర్వహించడం జరుగుతుం దన్నారు. ఎక్కడ లేని విధంగా నల్లబెల్లి మండలానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ ఊడుగుల సునీత ప్రవీణ్ గౌడ్, వైస్ ఎంపీపీ శ్రీలత శ్రీనివాస్, ఎంపీడీవో విజరు, మండల స్పెషల్ ఆఫీసర్ జహీరుద్దీన్, ఐటిడి ఏఈ చందర్రావు, పాఠశాలల ప్రధానో పాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం, ఎస్ఎంసి చైర్మన్ లు, సర్పంచులు, ఎంపీటీసీలు, తదితరులు పాల్గొన్నారు.