Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని ధర్నా
- విద్యాశాఖ అధికారి హామీతో ధర్నా విరమించిన తండావాసులు
నవతెలంగాణ-నర్సింహులపేట
స్థానిక జిల్లా పరిషత్ పాఠశాలలో అకస్మాత్తుగా విద్యార్థి మృతి చెందిన సంఘటనలో శనివారం మతిపై సమగ్ర విచా రణ జరిపి కుటుంబాన్ని ఆదుకుని న్యాయం చేయాలని ఫకీరాతండా వాసులు, ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాలు ధర్నా చేపట్టారు. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు ఘట నా స్థలానికి చేరుకున్నారు. విద్యార్థి ఫొటో చేత పట్టుకొని నినాదానాలు చేస్తూ బైఠాయించారు. సంబంధించిన అధికారులు వచ్చి హామీ ఇచ్చే వరకు కదిలేది లేదని పురమా యించడంతో పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘట నలు జరగకుండా అదనపు బలగాలను రప్పించారు. తొర్రుర్ సిఐ సత్యనారాయణ, పెద్దవంగర, దంతాలపల్లి, నెల్లికు దు రు, తొర్రూరు ఎస్ఐ లు సంఘటనా స్థలానికి చేరుకుని బాధి తులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసిన ఊరుకోలేదు. సంబం ధించిన విద్యాశాఖ అధికారులు వచ్చేంత వరకు కదలమని ధర్నాను కొనసాగించడంతో సీఐ సత్యనారాయణ మండల ఎంఈవోతో మాట్లాడి ఆయనను రప్పించారు. మం డల విద్యాశాఖ అధికారి రాము నాయక్ అక్కడికి చేరుకుని న్యా యం జరిగేలా చూస్తామని మీ డిమాండ్లను ఉన్నతా ధికారు లకు నివేదిస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమిం చారు. డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఆయనకు అంద జేశారు. మతునికి రూ.20లక్షల ఎక్స్‌గ్రేషియా, కుటుం బంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. ధర్నాలో రాజేష్, ఫకీరాతండా సర్పంచ్ శంకర్, టిఆర్ఎస్ మాజీ మం డల ఎస్టీ సెల్ అధ్యక్షుడు లావుడ్యా ఉదరు నాయక్, వీరన్న నాయక్, ఎస్ఎఫ్ఐ నాయకులు పట్ల మధు, సేవాలాల్ నాయకులు రవీందర్ నాయక్, పూర్ణచందర్, విష్ణు వర్ధన్‌రెడ్డి, తదితరులు ఉన్నారు.