Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధికారులపై జిల్లా కలెక్టర్ మండిపాటు
నవతెలంగాణ-చిట్యాల
మన ఊరు-మన బడి పనులు నత్తనడకన సాగుతున్నాయంటూ అధికారులపై జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా మండిపడ్డారు. మండలంలోని చల్లగరిగ, జూకల్ హైస్కూళ్లను శనివారం ఆయన ఆకస్మికంగా సందర్శించారు. మన ఊరు మన బడి పథకం ద్వారా పాఠశాలలకు నిధులు మంజూరు అయ్యాయి. మంజూరైన నిధులతో పనులు చేపట్టాల్సి ఉండగా అధికారుల అలసత్వం వల్ల ఎలాంటి పనులు ప్రగతి కనిపించకపోవడంతో అందుకు సంబంధించి మెటీరియల్ సమకూర్చకపోవడంతో అధికారులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పనుల కోసం అడ్వాన్స్‌గా డబ్బులు ఖాతాల్లో జమ చేసినప్పటికీ పనులు చేపట్టకపోవడంలో అంతర్యం ఏమిటని అధికారులను ప్రశ్నించారు. పనులు చేయని పక్షంలో టెండర్లను పిలిచి పనులు చేపడతామని హెచ్చరించారు. 10 రోజుల్లో పనుల్లో పురోగతి కనిపించా లని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట మండల స్పెషల్ ఆఫీసర్ శైలజ, ఎంఈఓ రఘుపతి, పంచాయతీ రాజ్ డీఈ వెంకటేశ్వర్లు, ఏఈ రవికుమార్, సర్పంచ్‌లు కర్రె మంజుల అశోక్‌రెడ్డి, పుట్టపాక మహేందర్, ఏఎంసీ చైర్మెన్ ప్రభాకర్, ఎంపీఓ రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.