Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అవుతూ పట్టణ ప్రజలను, కార్మికులను అసహనానికి గురి చేస్తోంది. కూరగాయల మార్కెట్ వరకు లైట్లు వెలుగుతూ, ఆ తర్వాత గని వరకు లైట్లు బంద్ అయ్యి నెలపైగా కావస్తున్న అధికారులు దష్టి సారించడం లేదు. నిత్యం డ్యూటీకి వెళ్లే వారితో, మిలీనియం క్వార్టర్స్, సుభాష్ కాలనీ, కాకతీయ కాలనీ వెళ్లే ప్రధాన రోడ్డు, జయశంకర్ పార్క్‌కు వెళ్లే పర్యాటకులతో నిత్యం రద్దీగా ఉండే రోడ్డు పైగా వర్షాకాలం కావడంతో చీకటి అధికంగా ఉంటుంది. రద్దీగా ఉండే రోడ్డు కావడంతో, అసలే వర్షం, పైగా చీకటి కావడంతో ప్రమాదాలు అతిగా జరిగే ప్రమాదం ఉన్నప్పటికీ సింగరేణి సివిల్ డిపార్ట్మెంట్ అధికారులు దష్టి సారించకపోవడం కార్మికులు, ప్రజల పట్ల వారి వైఖరిని స్పష్టం చేస్తోంది. ఇకనైనా వెంటనే సింగరేణి అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు చొరవ తీసుకొని సమస్యలు పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.