Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధ్యక్షుడుగా అన్నవరం రవికాంత్
నవతెలంగాణ-ములుగు
జిల్లా కేంద్రంలోని రిటైర్డ్ ఉద్యోగుల కార్యాలయంలో యువజన, ఉద్యోగ, కుల సంఘాలతోపాటు లాయర్లు, డాక్టర్లు, స్వేరో ఆధ్వర్యంలో ప్రజాసంఘాల జేఏసీ చైర్మెన్ ముంజాల భిక్షపతి గౌడ్ అధ్యక్షతన జిల్లా అభివృద్ధిపై ఆదివారం నిర్వహించిన సమీక్ష సమావేశం అనంతరం జిల్లా అబివృద్ధి కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడుగా అన్నవరం రవికాంత్, గౌరవ అధ్యక్షుడుగా ముంజాల భిక్షపతి, ఉపాధ్యక్షులుగా కొట్టెపాక శ్రీనివాస్, కొలిపాక ప్రశాంత్, గుండాల రఘు, ప్రధాన కార్యదర్శిగా అరిగెల స్వామినాథ్, కార్యదర్శులుగా బోడ రాజు, కూరెల్ల పరి పూర్ణచారి, సహాయ కార్య దర్శులుగా మారెపెల్లి నవీన్, గుండె మీది వెంకటేశ్వర్లు, మోడెం శివశంకర్, ప్రచార కార్యదర్శులుగా బైకాని రాజశేఖర్, తాటిపెల్లి శశికాంత్, లీగల్ అడ్వైజర్‌గా స్వామినాథ్, బొల్లి సారంగపాణి, కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. కమిటీని ప్రజా సంఘాల అధ్యక్షుడు భిక్షపతి అధ్యక్షతన ప్రకటించారు. గిరిజన యూనివర్సిటీ, బస్ డిపో, ఆర్టీఏ ఆఫీస్, జిల్లా అభివద్ధి సమస్యల గురించి త్వరలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. అనంతరం రవికాంత్‌ను ఘనంగా సన్మానించారు.