Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్సీ కార్పొరేషన్ ఈడీ
నవతెలంగాణ - స్టేషన్‌ఘన్‌పూర్
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళితబంధు పథకం లబ్దిదారులు ఆర్థికంగా బలప డాలని ఎస్సీ కార్పొరేషన్ జిల్లా ఈడీ డాక్టర్ వెంకన్న సూచించారు. మండలకేంద్రంలో లబ్దిదారుడు మారేపల్లి ప్రసాద్ పథకం ద్వారా పొందిన డోజర్ వాహనాన్ని ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ దళితుల ఆర్థిక బలోపే తానికి ఈ పథకం ఎంతో దోహదపడుతుందని అన్నారు. నిర్మించుకున్న యూనిట్ నుంచి ఆర్థికంగా ఎదిగి మరొకరికి ఆదర్శం కావాలని ఆకాంక్షించారు.