Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జూనియర్ సివిల్ జడ్జి రాజ్‌కుమార్
నవతెలంగాణ-తొర్రూరు
ప్రతి ఒక్క కక్షిదారులు జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకొని తమ కేసులను పరిష్కరించుకోవాలని తొర్రూరు జూనియర్ సివిల్ జడ్జి రాజ్‌కుమార్ అన్నారు. ఆదివారం జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోక్ అదాలత్‌లో కేసులకు సత్వర పరిష్కారం లభిస్తుందని తెలిపారు. రాజీ మార్గం ద్వారా కేసులను పరిష్కారం చేసుకొని సమ యం, డబ్బు ఆదా చేసుకోవాలని ఆయన కోరారు. ఈ లోక్ అదాలత్ ద్వారా 81 క్రిమినల్ కేసులు, మూడు కుటుంబ సంబంధిత కేసులు, నాలుగు సివిల్ కేసులు, 817 పెట్టి కేసులు పరిష్కరించినట్టు తెలిపారు. తద్వారా రూ.4లక్షల69వేల300 జరిమానా విధించారన్నారు. ఈ కార్యక్రమంలో ఏజీపీ ప్రవీణ్‌రాజ్, ఏపీపీ కిషోర్‌కుమార్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఐలోని, సీఐ సత్యనారా యణ, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.