Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పర్యటక కేంద్రంగా పాలకుర్తి అభివృద్ధి
- సోమనాధ కళాపీఠం సేవలు అభినందనీయం
- రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ
- మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పురస్కార గ్రహీతలకు సన్మానం
నవతెలంగాణ-పాలకుర్తి
ప్రపంచస్థాయికి సోమనాధుడి కీర్తిని చాటి చెప్పాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి ప్రాంగణంలో సోమనాధ కళాపీఠం ఆధ్వర్యంలో సోమనాథ కళాపీఠం అధ్యక్షుడు డాక్టర్ రాపోలు సత్యనారాయణ అధ్యక్షతన పురస్కార ప్రదానోత్సవం కార్యక్రమం నిర్వహించారు. మంత్రి ఎర్రబెల్లి పాల్గొని మాట్లా డుతూ.. సీఎం కేసీఆర్ సహకారంతో పాలకుర్తి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. సోమనాథ జన్మ స్థలానికి రూ.10 కోట్లు, బమ్మెర పోతన జన్మస్థలం అభివృద్ధికి రూ.10 కోట్లు, వాల్మీకి మహర్షి వల్మిడి గ్రామానికి రూ.10 కోట్లు కేటాయించి అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. చారిత్రక నేపథ్యాన్ని చాటి చెప్పేది అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. సోమనాథ కళాపీఠం ఆధ్వర్యంలో నిర్వ హిస్తున్న పురస్కారాలు అభినందనీయమన్నారు. సోమనా థుడి సాహిత్యాన్ని భావజాలాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసు కెళ్లాలని సూచించారు. ఈ సందర్భంగా పురస్కార గ్రహీత లకు అవార్డులు, జ్ఞాపికలు అందజేసి శాలువాలతో మంత్రి సన్మానించారు. ఈ కార్యక్రమంలో సోమనాథ సాహిత్య పురస్కారం గ్రహీత ప్రొఫెసర్ మఠం లింగయ్య స్వామి, సోమనాథ సామాజిక శోధన పురస్కార గ్రహీత దండి వెంకట్, సోమనాథ రంగస్థల పురస్కార గ్రహీత తడకమళ్ళ రామచంద్రరావు, పందిళ్ళ శేఖర్‌బాబు, రాజయ్య శాస్త్రి స్వచ్ఛంద భాషా సేవా పురస్కార గ్రహీత సత్తి సునీల్ రెడ్డి, వీరమనేని చలపతిరావు, సాహిత్య పురస్కార గ్రహీత డాక్టర్ చింతకాయల ఆంజనేయులు, మొశం దామోదరరావు ప్రాచీన చరిత్ర వైజ్ఞానిక పరిశోధన పురస్కార గ్రహీత వేద వీర్ ఆర్య, డాక్టర్ రాపోలు సోమయ్య, ప్రతిభ పురస్కార గ్రహీత చిలకమారి రాజేష్, సరస్వతి సంసేవక బిరుదు గ్రహీత వేముల శ్రీ వేమన శ్రీ చరణ్సాయిదాస్, డాక్టర్ లింగంపల్లి రామచంద్ర, డాక్టర్ పరికిపండ్ల అశోక్, బసవ కప ఎడిటర్ ప్రొఫెసర్ ఏ జగదీష్, సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం చైర్మన్ వెనుకదాసుల రామచంద్రయ్య శర్మ, కార్యనిర్వహణ అధికారి నండూరి రజని కుమారి, సర్పంచ్ వీరమనేని యాకాంతారావు, సోమనాథ కళాపీఠం ఉపాధ్యక్షులు మార్గం లక్ష్మీనారాయణ, సంయుక్త కార్యదర్శి మామిండ్ల రమేష్ రాజా, కోశాధికారి రాపాక విజరు, గౌరవ సలహాదారులు వీరమనేని వెంకటేశ్వరరావు, కార్యవర్గ సభ్యులు సాంబయ్య, బుజంధర్, రామ్మోహన్‌చారి, సాయి తరుణ్, తదితరులు పాల్గొన్నారు.