Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీసీసీ అధ్యక్షుడు నల్లెల్ల కుమారస్వామి
నవతెలంగాణ-ములుగు
అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాలని కోరుతూ జిల్లా కేంద్రంలో ఈనెల 27న సత్యాగ్రహ దీక్ష చేపట్టనున్నట్టు డీసీసీ అధ్యక్షుడు నల్లెల్ల కుమారస్వామి తెలిపారు. జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించిన ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని పార్టీ జిల్లా, మండల, బ్లాక్ కాంగ్రెస్, అనుబంధ సంఘాల జిల్లా, మండల అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తరలిరావాలని కోరారు. రైతుల ఖాతాల్లో రైతుబంధు డబ్బు జమ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులను ఇబ్బందులకు గురి చేస్తే కిసాన్ సెల్ ఆధ్వర్యంలో పోరాటాలు చేపడతామని జిల్లా అధ్యక్షుడు గొల్లపెల్లి రాజేందర్‌గౌడ్ హెచ్చరించారు. సమావేశంలో యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బానోత్ రవిచందర్, మండల అధ్యక్షుడు చాంద్ పాషా, మాజీ సహకార సంఘం చైర్మెన్ కూనూరు అశోక్‌గౌడ్, ఎంపీటీసీ మవురాపు తిరుపతిరెడ్డి, మైనార్టీ సెల్ జిల్లా కార్యదర్శి అజ్జు తదితరులు పాల్గొన్నారు.