Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గోవిందరావుపేట
మండలంలోని సంక్షేమ హాస్టళ్లలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కన్వీనర్ తోకల రవి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండలంలోని పసరలోని భగత్ సింగ్ భవన్లో వెంకటేష్ అధ్యక్షతన ఆదివారం నిర్వ హించిన సంఘం జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశా నికి రవి హాజరై మాట్లాడారు. విద్యా సంవత్సరం ప్రారంభమై సుమారు 15 రోజులు గడుస్తున్నా సంక్షేమ హాస్టళ్లలో తాగునీటి, ఇతర సమస్యలు అలాగే ఉన్నాయని చెప్పారు. తాగునీటి, మరుగు దొడ్ల, ఇతర సమస్యలను పరిష్కరించేలా పనులు చేపట్టాల్సి ఉందన్నారు. పాఠశాలల్లోనూ విద్యార్థులకు ఇంకా పుస్తకాలు అందలేదని చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సమస్యలను పరిష్కరించడంతో పాటు బకాయి ఉన్న స్కాలర్షిప్ డబ్బులు విడుదల చేయాలని, విద్యార్థుల స్కాలర్షిప్ విషయంలో అవకతవకలకు పాల్పడుతున్న ప్రైవేటు డిగ్రీ, జూనియర్ కళాశాలల యాజమాన్యాల గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో నాయకులు వెంకట్, జస్వంత్, సింధుప్రియ, సంతోష్, మోహన్, మణిచంద్, రాజు, వసంత్ తదితరులు పాల్గొన్నారు.