Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కేంద్రంలో యూత్ కాంగ్రెస్ ధర్నా
నవతెలంగాణ-భూపాలపల్లి
అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాలని యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బండ శ్రీకాంత్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో ఆదివారం మానవహారం నిర్వహించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం సైన్యంలో శాశ్వత ప్రాతిపదికన నియామకాలు చేపట్టాల్సి ఉండగా నాలుగేండ్ల కోసం తాత్కాలిక నియామకాల కోసం అగ్నిపథ్‌ను ప్రవేశపెట్టడం సరికాదన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తుల కోసమే పని చేస్తోందని మండిపడ్డారు. అగ్నిపథ్‌ను ఉపసంహరించుకోని పక్షంలో బీజేపీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. అగ్నిపథ్ రాష్ట్రంలో విధ్వంసానికి కారణం కాగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిఘా వ్యవస్థ పటిష్టంగా లేకపోవడం కనిపించిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అరెస్ట్ చేసిన విద్యార్థులను వెంటనే విడుదల చేసి కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు తోట రంజిత్, విజరు, పథ్వీరాజ్, బడితల ప్రసాద్, పవన్, విజరు, నరేష్, ఆంజనేయులు, క్రాంతి, తదితరులు పాల్గొన్నారు.