Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ధర్మసాగర్
బహుజన రాజ్యాధికార సాధనే లక్ష్యంగా బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ముందుకు సాగుతున్నారని ఆ పార్టీ స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ అధ్యక్షుడు బొడ్డు రాహుల్ రారు తెలిపారు. ఛత్రపతి సాహు మహారాజ్ జయంతి సందర్భంగా మండల కేంద్రంలో ఆయన చిత్రపటానికి ఆదివారం పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. అనంతరం రాహుల్ రారు మాట్లాడారు. స్త్రీల అభ్యున్నతికి సాహు మహారాజ్ అనేక సంస్కరణలు చేశారని కొనియాడారు. సీఎం కేసీఆర్ కొల్లగొట్టిన శ్రమజీవుల సంపదను తిరిగి సాధించే దిశగా ప్రవీణ్‌కుమార్ పాటుపడుతున్నారని చెప్పారు. అనంతరం హనుమకొండలో తలపెట్టిన బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడి సభకు బయల్దేరిన వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో ఆ పార్టీ మండల ఇన్‌ఛార్జి సహోదర్, నాయకులు బొడ్డు ధనుంజరు, దార కనకయ్య, భాగ్య, దీపక్, పథ్విరాజ్, రఘు ప్రసాద్, విశాల్, నిఖిల్, శ్రీకాంత్, చింటూ, శ్రావణ్, తదితరులు పాల్గొన్నారు.