Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
- గణపసముద్రం నుంచి నీటి విడుదల
నవతెలంగాణ-గణపురం
రైతుల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయ మని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి తెలిపారు. మండల కేంద్రంలోని గణపసముద్రం చెరువు 4 కాల్వల్లోకి ఆదివారం ఆయన నీటిని విడుదల చేసి మాట్లాడారు. కాల్వల మరమ్మతు కు తక్షణమే రూ.32 లక్షలు విడుదల చేస్తూ సంబంధిత ఆధికారులను ఆదే శించారు. గణపసముద్రం నీటిని రైతులు వినియోగించుకోవాలని కోరారు. రైతులు పంటలు ముందుగా వేసు కుంటే వడ్ల కొనుగోలు ప్రక్రియ త్వరగా పూర్తవుతుందని చెప్పారు. కార్యక్రమంలో సర్పంచ్ నారగాని దేవేందర్, ఎంపీటీసీ మోటపోతుల శివశంకర్ గౌడ్, సొసైటీ చైర్మెన్ పోరెడ్డి పూర్ణచందర్‌రెడ్డి, సర్పంచ్ల ఫోరమ్ మండల అధ్యక్షుడు నగేష్, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు లక్ష్మీ నర్సిం హారావు, ఉపసర్పంచ్ పోతర్ల అశోక్, నాయకులు మారగాని శ్రీనివాస్, వడ్లకొండ నారాయణ గౌడ్, పోతర్ల మల్లికార్జున్, గుర్రం తిరుపతి గౌడ్, ఐబీ డీఈ సుధ, ఏఈ శ్రీనివాస్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.