Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మట్టెవాడ
ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో విద్యార్థుల కు కోడిగుడ్లను అందించలేమని అధిక ధరల పెరుగుదలతో బహిరంగ మార్కెట్లో కోడిగుడ్డు పై రూ.2ల భారం పడుతుందని కోడిగుడ్లను ప్రభుత్వమే సరఫరా చేయాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన వంట కార్మికుల సంఘం టిఆర్ఎస్కేవి అనుబంధం వరం గల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వరంగల్ మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ విజరు కుమార్‌కి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా అధ్యక్షురాలు లక్ష్మి మాట్లాడుతూ కోడిగుడ్ల సరఫరాను ప్రభుత్వమే చేయాలని, ప్రతి నెల 5లోపు బిల్లులు చెల్లించాలని పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని, వంట సామాగ్రి, వంట గ్యాస్ ప్రభుత్వమే సమకూ ర్చాలని మెస ్చార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు. పెరిగిపోయిన ధరల తో మధ్యాహ్న భోజనం పథకం లో విద్యార్థులకు వంట లు చేయాలంటే ఆర్థికంగా ఇబ్బందులు తలెత్తుతున్నాయని అన్నారు. రజినీ, ఊర్వశి, రాజేశ్వరి, మేరీ, పాల్గొన్నారు.