Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ డిప్యూటీ సీఎం, ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య
నవతెలంగాణ-రఘునాథపల్లి
రాష్ట్రంలో ఎనిమిదేండ్ల టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో అభివద్ధి గొప్పగా సాగుతున్న తరుణంలో బీజేపీ ప్రభుత్వం, ప్రధాని మోడీ అడ్డంకులు సృష్టిస్తున్నారని మాజీ డిప్యూటీ సీఎం, ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. సోమవారం రఘునాథపల్లి మండల కేంద్రంలో దళిత బందు పథకంలో మంజూరైన జ్యోతి సూపర్ మార్కెట్‌ను ఆయన ప్రారంభించారు. దళిత నేత , టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి ముసిపట్ల విజరుని అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ మహా నేత గా ప్రజలు కష్టాలు తొలగించేందుకు ప్రాజెక్టులు నిర్మించి రైతులకుపెద్ద పీట వేశాన్నారు. రైతులకు రైతుబీమా, సబ్బండ వర్గాలకు అనేక పథకాలు ప్రవేశపెట్టి ఆదుకున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ప్రధాని మోడీ పాలనలో తెలంగాణ రాష్ట్రంలో కనీసం ఒక్క పరిశ్రమ కూడా లేదని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తే పుట్టగతులుండవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్ష, కార్యదర్శులు వరాల రమేష్‌యాదవ్, ముసిపట్ల విజరు, సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షుడు పోకల శివకుమార్గుప్తా, మాజీ జెడ్పీటీసీ మారుజోడు రాంబాబు, మడ్పల్లి సునిత, రమ్య, దుబ్బాక హరీష్‌గౌడ్, రాజు మాస్టర్, సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.