Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి
- అధికారుల అటెండెన్స్ తప్పనిసరి
- ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచాలి
- ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ క్రిష్ణఆదిత్య
నవతెలంగాణ-ములుగు
ప్రజావాణి దరఖాస్తులను పెండింగ్లో లేకుండా త్వరితగతిన పరిష్కరించాలని, వర్షాకాలంలో సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచాలని జిల్లా కలెక్టర్ యస్ క్రిష్ణ ఆదిత్య జిల్లా సంబంధిత శాఖల అధికారులకు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ఆయన హాజరై ప్రజల నుండి ధరణి సమస్యలపై 21, రెవెన్యూ శాఖ 10, ఇతర శాఖలకు సంబంధించినవి 16, వివిధ సమస్యలపై మొత్తం 47, ప్రజావాణి దరఖాస్తులను స్వీకరించారు. ప్రజావాణి దరఖాస్తులు మొత్తం 47 రాగా వాటిని సంబంధిత శాఖలకు సిఫారస్ చేసి పెండింగ్ లేకుండా చూడాలని సంబంధిత శాఖ అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ములుగు వెలుగు అటెండెన్స్ యాప్ ద్వారా హాజరు తప్పనిసరిగా నమోదు చేయాలని, సంబంధిత శాఖల అధికారుల హాజరు కూడా యాప్ లో నమోదు చేసు ్తన్నారా, లేదా పర్యవేక్షణ చేయాలన్నారు. విష జ్వరాల బారిన పడకుండా టెస్టింగ్ కిట్లు ఎక్సరే మిషన్ రక్త పరీక్ష కిట్లు, మందులు సబ్ సెంటర్లలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రా ల్లో అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. విద్యార్థుల హాజరు సంఖ్య పెంచాలని జిల్లా విద్యాశాఖ అధికారి పాణిని ఆదేశించారు. ఇసుక ఓవర్ లోడింగ్ లారీలను నిలిపివేసి సీజ్ చేయాలన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం గా ఉండేలా రామప్ప లక్నవరంలో ఉన్న స్పీడ్ బోట్లు అందుబాటులో ఉండేలా వాటిని సంసిద్ధం చేయా లన్నారు. వివిధ శాఖలలో పెండింగ్లో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాటిని త్వరతగతిన పరిష్కరించేలా అధికారులు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఇలా త్రిపాఠి, వై వి గణేష్ డిఆర్ఓ కె రమాదేవి, జిల్లా అడిషనల్ సూపరింటెండెంట్ సుధీర్ రామ్నాథ్ కెకన్, ఏటూర్ నాగారం ఏఎస్పి అశోక్ కుమార్ డీఆర్డీఓ వెంకట నారాయణ, డిపిఓ వెంకయ్య, జిల్లా వైద్యాధికారి అప్పయ్య, బీసీ సంక్షేమ శాఖ అధికారి లక్ష్మణ్, ఎస్సీ కార్పొరేషన్ ఈ డి తులా రవి, ఎస్సీ వెల్ఫేర్ అధికారి పి. భాగ్యలక్ష్మి, డి డబ్ల్యూఓ ప్రేమలత, ఈడి మైనింగ్ రఘుబాబు, విద్యాశాఖ అధికారి పాణిని, సంబంధిత శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.