Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మట్టెవాడ
సీజనల్ వ్యాధులు, కొవిడ్ పై అప్రమత్తంగా ఉండా లని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పి సాంబ శివరావు పేర్కొన్నారు. సోమవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాలు, పల్లె దవాఖాన వైద్యాధికారులు నిర్వహించిన జూమ్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ వర్షాకాలంలో నీరు నిల్వ ఉండ టం, పరిసరాల పరిశుభ్రత వల్ల దోమలు ఎక్కువగా వద్ధి చెందే అవకాశం ఉండటం, తద్వారా మలేరియా, డెం గ్యూ కేసులు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. ప్రతి శుక్రవారం డ్రై డే పాటించాలన్నారు. పీహెచ్‌సీల్లో ఓపికి వచ్చే వారిలో జ్వర లక్షణాలు ఉన్నవారికి రక్త పరీక్షలు చేయాలని, ఒకవేళ పాజిటివ్‌గా నిర్ధారణ అయితే పరి సర ఇళ్లలో స్ప్రే చేయించాలని అన్నారు. జిల్లాలో 4 మలే రియా 5 డెంగ్యూ కేసులు ఈ సంవత్సరం జనవరి నుండి ఇప్పటివరకూ నమోదు అయ్యాయన్నారు. పల్లె దవాఖాన వైద్యాధికారులు కూడా తమ పరిధిలో పై చర్యలు తీసుకోవాలన్నారు. కొవిడ్ కొన్ని రాష్ట్రాల్లో, అలాగే హైదరాబాద్ పరిధిలో ఎక్కువగా నమోదు అవు తున్నందున మనం జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ట ెస్టుల సంఖ్య పెంచాలని పేర్కొన్నారు. మాతా శిశు సంక్షే మం, ఎంసిడి, ఆరోగ్యశ్రీ, టిబి, ఇతర కార్యక్ర మాలను సమీక్షించారు. సమావేశంలో అడిషనల్ డీఎంహెచ్‌వో డాక్టర్ మదన్మోహన్రావు, ప్రోగ్రాం అధికారులు డాక్టర్ ఉవశ్రీ, డాక్టర్ వాణి డిఐఓ డాక్టర్ గీతా లక్ష్మి, డిటిడిసిఓ డాక్టర్ మల్లికార్జున్, డెమో వి.అశోక్ రెడ్డి, స్టాటిస్టికల్ ఆఫీసర్ ప్రసన్న కుమార్ పాల్గొన్నారు.