Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వెంకటాపూర్
మండలంలోని నూతన గ్రామ పంచాయతీగా ఏర్పడ్డ పాపాయిపల్లికి ఎత్తైన వంతెన నిర్మించాలని పిఎసిఎస్ డి సి బి డైరెక్టర్ మాడుగుల రమేష్ జిల్లా కలెక్టర్‌ను, పంచాయతీ రాజ్ డి ఈ లను కోరారు. ఈ సందర్భంగా ఆయన ఆదివా రం విలేకరులతో మాట్లాడుతూ వర్షాకాలం మొదలైతే గ్రామ ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. గత రెండు సంవత్సరాలుగా వానాకాలం లో వర్షాలు అధిక మోస్తరుతో కురవడం వల్ల రామప్ప సరస్సు నీటిమట్టం ఎక్కువయ్యి మత్తడి పోయడంతో గ్రామ శివారులోని పల్లె ప్రకతి వనం వద్ద రోడం పై నుండి నీరు ఎక్కువగా ప్రవహిం చడంతో గ్రామ ప్రజలకు రాకపోకలు తాళ్ల సహాయంతో వెళ్లడం జరుగుతుందని తెలిపారు. ఈ వంతెన విషయంపై పలుమార్లు అధికారులకు గ్రామస్తులు వినిపించినట్లు పేర్కొ న్నారు. ఇప్పటికైనా అధికారులు ఎత్తైన వంతెన మంజూరు చేసి అత్యవసరంగా హై లెవెల్ కల్వర్టు నిర్మించే విధంగా కషి చేయాలని జిల్లా అధికారులను కోరారు. కార్యక్రమంలో గాజుల రాజ నరసయ్య, సూత్రపు కర్ణాకర్, జానపట్ల సంపత్, భూపెళ్లి రమేష్, కాసర్ల సురేష్, మాడుగుల భాస్కర్ గ్రామస్తులు పాల్గొన్నారు.