Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తూర్పు ఎమ్మెల్యే నరేందర్
నవతెలంగాణ-కాశిబుగ్గ
దళితబంధు పథకం ద్వారా సీఎం కేసీఆర్ దళితుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతున్నారని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. దళితబంధు పథకం ద్వారా కాశిబుగ్గకు చెందిన పెండ్యాల సోనుకు మంజూరైన యూనిట్లతో ఏర్పాటు చేసుకున్న సోను టైల్స్ అండ్ సానిటరీ షాప్ను సోమవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ దళిత జీవితాలు మారాలని ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకొని ఆర్థిక పరిపుష్టి సాధించాలని కోరారు. కార్యక్రమం లో గోరింటల మనోహర్, జూలూరి గంగాధర్, డివిజన్ అధ్యక్షులు ఎండీ ఇక్బాల్, వేముల నాగరాజు,. పెండ్యాల కొమురయ్య, .క్యాతం రంజిత్, బాల మోహన్, కుసుమ సారంగపాణి, తదితరులు పాల్గొన్నారు.