Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధికారులు సమస్యలపై దృష్టి సారించాలి
- ఐటిడిఎ పివో అంకిత్
నవతెలంగాణ-ఏటూరునాగారం (టౌన్)
సోమవారం ఐటీడీఏ కార్యాలయంలో ఐటీడీఏ పీవో-1 అంకిత్ ఆధ్వర్యంలో నిర్వహించిన గిరిజన దర్బార్‌కు ఐటిడిఎ పరిధిలోని ఆయా మండలాల నుండి గిరిజనులు వారి సమస్యలను వినతుల రూపం లో సమర్పించారు. వినతులను పరిశీలించగా ఎస్టీ నాయకపోడు, కుల సంస్కతి సంప్రదాయాలను కించపరుస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఎంపీటీసీ కోటా నరసింహులు తెలిపారు. కొంతమంది బీసీలు లక్ష్మీదేవరను ఆయా గ్రామాల్లో ఆడిస్తూ ఆదివాసీల మనుగడను దెబ్బతీస్తున్నారని తెలిపారు. అదేవిధంగా జిపిఎస్ భోధాపురం పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయులు బదిలీపై వెళ్లారని ఒక్కడే ఉపాధ్యా యుడు పనిచేస్తున్నాడని, 60 మందికి పైగా విద్యా ర్థులు ఉండగా ఒక ఉపాధ్యాయుని తో పాఠశాల కొన సాగడం కష్టంగా ఉందని, మరో ఇద్దరిని నియమిం చాలని విద్యా కమిటీ చైర్మన్ రాజ్ కుమార్ తెలిపారు. అదేవిధంగా ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలలో హాస్టల్లో సేవ నిర్వహిస్తున్న హెల్త్ కోఆర్డినేటర్లు ఐటీడీఏ ద్వారా కొనసాగించాలని హెల్త్ కోఆర్డినేటర్లు తెలిపారు. ఈ విధంగా ఆయా మండలాల నుండి సుమారు 60కి పైగా వినతులు రాగా ఐటీడీఏ సెక్టో రల్ అధికారులు, పోలీస్, అటవీశాఖ ఆయా శాఖల అధికారులు గిరిజన గ్రామాల్లోని సమస్యలపై దష్టి పెట్టాలని పివో ఆదేశించారు. ప్రతి సోమవారం నిర్వ హించే గ్రీవెన్స్‌డేకు వచ్చిన వినతులను అధికారులు పరిశీలించి వీలైనంత త్వరలో వాటికి పరిష్కారం చూపాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఐటిడిఎ ఏపీఓ వసంతరావు, ఏవో రఘు, డిడి పోచం, ఎస్డిసి రాములు, ఆర్సిఓ రాజ్యలక్ష్మి, జిసిసిడి ఎం.ప్రతాప్ రెడ్డి, ఎస్సై రమేష్ ఎక్సైజ్ సి ఐ ఫకీరా, సిడిపిఓ హేమలత తదితరులు పాల్గొన్నారు.