Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య
నవతెలంగాణ-ములుగు
లైంగిక వేధింపులకు పాల్పడ్డ వారిపై చట్టపరమైన కఠిన శిక్షలు తప్పవని జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య అన్నారు. సోమవారం జిల్లాస్థాయి అట్రాసిటి కమిటీ సమావేశంలో ఆయన మహిళలపై లైంగిక వేధింపుల నిరోధానికి జిల్లాలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని పేర్కొన్నారు. సోమ వారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో లైంగిక వేధింపుల కారణంగా అత్యాచార బాధితులైన మహిళలు, బాలికలకు అందించే పునరావాస ఆర్థిక సహాయం పై జిల్లా స్థాయి అట్రాసిటీ కమిటీ సమావేశం జిల్లా సంక్షేమ అధికారి అధ్యక్షతన నిర్వహించారు. కలెక్టర్ హాజరై మాట్లాడుతూ జి.వో.నెంబర్ 28 ప్రకారం ములుగు జిల్లాలో వివిధ దశల్లో ఉన్న 69 కేసులకు గాను అర్హులైన 56 మంది బాధిత మహిళలు, బాలికలకు పూర్తి కేసు వివరాలను కమిటీ ఆధ్వర్యంలో పరిశీలించారు. అర్హులైన ప్రతి బాధి తురాలికి పునరావాస ఆర్ధిక సహాయం అందించాలని తెలుపుతూ కమిటీ ప్రతి మూడునెలల ఒక్కసారి సమావేశంమై నిబంధనల ప్రకారం పరిశిలించి ఎప్పటి కప్పుడు నివేదిక ఇవ్వాలని సంబంధిత అధికా రులకు ఆదేశించారు. ఈ సందర్బంగా అర్హులైన బాధితు లకు ఆర్థిక సహాయం త్వరగా నేరుగా వారి అక్కౌంట్లకే అందే టట్లు చర్యలు తీసుకోవాలని జిల్లా సంక్షేమ అధికారి ప్రేమలతను ఆదేశించారు. పరిహారం కోసం వచ్చిన ప్రతీ కేసును జడ్జిమెంట్ వరకు ఫాలో-అప్ చేస్తూ వారికి ఏ స్థాయిలో అవసరం ఉన్నా సహాయం అందించాలని అన్నా రు. పాఠశాలల్లో, హాస్టళ్లలో చదువుతున్న బాలలు ఎక్కువ రోజులు బడికి రాకుండా గైర్హాజరు అయినవారిని గుర్తిం చి, విద్యాశాఖ, మహిళా అభివద్ధి శిశు సంక్షేమ శాఖ అధి కారులు సమన్వయంగా ఆ బాలల గహ సందర్శన చేయ డం, కౌన్సిలింగ్ ఇవ్వడం, మళ్లీ బడికి పంపించా లన్నారు. జిల్లా సంక్షేమ అధికారినీ మాట్లాడుతూ బాధి తులకు కేసు నమోదు చేసి ఛార్జ్ షీట్, మెడికల్ రిపోర్ట్ జడ్జిమెంట్ కాఫీల ఆధారంగా బాధితుల కు పునరావాస ఆర్థిక సహా యం ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు ఇలా త్రిపాఠి, వై వి గణేష్, డిఆర్వో కూతాటి రమాదేవి, ఏఎస్పి సుధీర్ రా మ్నా థ్ కేకన్, ఏటూరునాగారం ఏఎస్పి అశోక్ కుమార్, జిల్లా వైద్యాది óకారి అప్పయ్య, షెడ్యూల్ కులాల అభివద్ధి సంక్షేమ అధికారి భాగ్య లక్ష్మి, బీసీ సంక్షేమ ఆఫీసర్ లక్ష్మణ్, డిఆర్డిఓ వెంకట నారాయణ, విద్యాశాఖాధికారి ఫణిని, బిఆర్బి కోఆర్డినేటర్. స్వాతి, డిసిపిఓ ఓంకార్, డిసిపియు చైల్డ్ లైన్ సిబ్బంది పాల్గొన్నారు.