Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కన్నాయిగూడెం
మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు మాదిగ మహాజన సోషలిస్టు పార్టీ ములుగు నియోజకవర్గ ఇన్చార్జి వావిలాల స్వామి ఆధ్వర్యంలో గుర్రెవుల, కన్నాయిగూడెం, బుట్టాయిగూడెం, ఏటూరు, గ్రామాల్లో సంగ్రామ పాదయాత్ర చేశారు. ఈ సంగ్రామయాత్ర తుపాకుల గూడెం నుండి ఏటూరు వరకు పాద యాత్ర నిర్వహించారు. అనంతరం స్వామి మాట్లాడుతూ ఈ పాదయాత్ర ముఖ్య ఉద్దేశం ఎస్సీ 59 ఉప కులాలకు ఏ బి సి డి లు వర్గీకరణ వంద రోజుల్లో బిజెపి కేంద్ర ప్రభుత్వం చేస్తానని ఎనిమిది సంవత్సరాలు గడిచినా ఇంతవరకు చేయలేదని అన్నారు. ఈ సంగ్రామ పాదయాత్ర తెలంగాణ ,ఆంధ్ర ప్రదేశ్ ,తమిళనాడు, నాలుగు రాష్ట్రాల నుండి పాదయాత్రలు మొదలు పెట్టడం జరిగిందని అన్నారు. మందకృష్ణ మాదిగ ఆదేశం మేరకు జూలై 2, 3 తేదీలలో బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశం హైదరాబాదులో జరుగుతున్న సభను జన దిగ్బంధం చేస్తామని హెచ్చరించారు. పాదయాత్రలో పుల్లూరు కర్ణాకర్ మాదిగ, ఎమ్మార్పీఎస్ ములుగు జిల్లా కన్వీనర్ వావిలాల సాంబశివరావు, మండల ఇంచార్జి సురేష్ మాదిగ, నరసింహారావు మాదిగ, సిల్వర్ రమేష్ మాదిగ, కన్నాయిగూడెం ఇంచార్జి ఆదినారాయణ మాదిగ, చిప్పలపల్లి బాబు, మాదిగ మందపల్లి వినరు మాదిగ, కొడాలి సత్యం మాదిగ, వాసంపల్లి సమ్మయ్య మాదిగ మేడ్చల్ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.