Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అగ్నిపథ్‌ను వెనక్కి తీసుకోకపోతే
- కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళన
- మాజీ మంత్రి కొండా సురేఖ
నవతెలంగాణ-మట్టెవాడ
కేంద్రంలోని బిజెపి, రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగ యువత జీవితాలతో చెలగాటం ఆడుకుం టున్నాయని కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకాన్ని వెంటనే రద్దు చేయాలని మాజీ మంత్రి కాంగ్రెస్ నేత కొండా సురేఖ డిమాండ్ చేశారు. అగ్నిపథ్‌ను రద్దు చేయాలని కోరుతూ పోచమ్మమైదాన్ సెంటర్లో కొండా యువసేన ఆధ్వర్యంలో సోమవారం సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. దీక్షకు కొండా సురేఖ వస్తున్నారన్న విషయం తెలియగానే పోలీసులు పెద్ద ఎత్తున రంగంలోకి దించారు. ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. దీక్షకు ముఖ్య అతిథిగా కొండ సురేఖ హాజరై సంఘీభావం తెలుపుతూ వారితో పాటు దీక్షలో కూర్చున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మోడీ నిర్ణయాలతో దేశ భవిష్యత్తు అంధకారం అయ్యే పరిస్థితులు తలెత్తాయని ప్రభుత్వరంగ సంస్థలను ఒక్కొక్కటిగా అమ్ముకుంటూ కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడ్డారు. యువత సైనికులుగా దేశ సేవ చేయాలనే వారికి అగ్నిపథ్ పథకం ఆటంకంమే కాక దేశ రక్షణకు ప్రమాదకరంగా మారిందని అన్నారు. రాష్ట్రంలోని తెరాస నాయకులు విచ్చలవిడిగా దోచుకుంటున్నారని 8 సంవత్సరాలు అయినా నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇచ్చిన దాఖలాలు లేవని అన్నారు. యువతకు అన్యాయం చేస్తే కాంగ్రెస్ పార్టీ ఊరుకోదని పెద్ద ఎత్తున నిరసనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో టిపిసిసి కార్యదర్శి మీసాల ప్రకాష్, నల్గొండ రమేష్, కొండా యువసేన వరంగల్ జిల్లా అధ్యక్షుడు శివ, భశపాక సదానందం, మంతిని సునీత, గుడా శారద, జన్ను జయ, కీర్తి, నయూమ్,తదితరులు పాల్గొన్నారు.
అగ్నిపథ్రు రద్దు పర్చాలి
నర్సంపేట : అగ్నిపథ్ పథకాన్ని వెంటనే రద్దు పర్చి సైనికులను అవమానపర్చాని కేంద్ర ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలని కాంగ్రేస్ నాయకులు డిమాండ్ చేశారు. సోమ వారం పట్టణంలోని ఆర్అండ్బీ గెస్టు హౌజ్ ఎదుట కాంగ్రేస్ ఆధ్వర్యంలో సత్యగ్రహ దీక్షా చేపట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నియోజకవర్గ నాయకులు తక్కెళ్లపెల్లి రవీందరావు, వేముల సాంబయ్య మాట్లాడుతూ సికింద్రబాద్ రైల్వే స్టేషన్లో ఈ నెల 17న జరిగిన పోలీసు కాల్పులకు కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వాలు బాధ్యతవహించాలన్నారు. కార్యక్రమంలో కాంగ్రేస్ నాయకులు పెండెం రామానంద్, సొంటిరెడ్డి రంజి త్‌రెడ్డి, ఎడ్ల జగన్మోహన్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, పార్వతమ్మ, పద్మబాయి తదితర మండలా బాధ్యులు పాల్గొన్నారు.
చెన్నారావుపేట : దేశం కోసం పనిచేస్తామని ముందుకు వచ్చిన యువకులను కేంద్రం దేశ ద్రోహులుగా చిత్రీకరిస్తుందని, దేశ రక్షణను పణంగా పెట్టే అగ్నిపథ్ పథకాన్ని వెంటనే రద్దు చేయాలని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు భూక్య గోపాల్ నాయక్ డిమాండ్ చేశారు. సోమవారం ఆర్అండ్బి గెస్ట్ హౌస్ సమీపంలో పార్టీ పిలుపు మేరకు పిసీసీ సభ్యుడు పెండెం రామ్‌నద్ ఆధ్వర్యంలో అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాలని చేపట్టిన సత్యాగ్రహ దీక్షలో పాల్గొన్న గోపాల్‌నాయక్ మాట్లాడుతూ దేశ రక్షణ విషయంలో బిజెపి నకిలీ దేశభక్తి బట్టబయలు అయిందన్నారు. ఈ దీక్షలో జిల్లా కార్యదర్శి మొగిలి వెంక ట్‌రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మంద యాకయ్య గౌడ్, ఉపాధ్యక్షులు మంచాల సదయ్య, కార్యదర్శి నన్నే బోయిన రమేష్, యూత్ అధ్యక్షుడు బండి హరీష్, ఉపాధ్యక్షుడు ప్రవీణ్, సంపత్ రెడ్డి, సర్పంచులు సిద్ధన రమేష్, రమేష్, మహిళా మండల అధ్యక్షురాలు బండి పద్మ, తదితరులు పాల్గొన్నారు.