Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వరంగల్
మహానగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయం సమావేశ మందిరం సోమవారం ప్రజావాణి కార్యక్ర మానికి పలు కాలనీల్లో నెలకొన్న ప్రజా సమస్యలు పరిష్కరించాలని బల్దియా కమిషనర్ ప్రావీణ్యకు వినతిపత్రం అందజేశారు.
ప్రజావాణికి వచ్చిన కొన్ని వినతులు
హన్మకొండ హనుమాన్ నగర్ డబ్బాలు వద్ద పెద్ద డ్రైనేజ్ నిర్మించాలని సాయినగర్ కాలనీ డెవలప్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. భద్ర కాళి గుడి, సరస్వతి దేవస్థానం వెనుకభాగంలో డ్రైనేజ్ నిర్మించాలని స్థానికులు వినతిపత్రం అందజేశారు. 11వ డివిజన్ రంగంపేట ఏకశిలా హోటల్, పాలి టెక్నిక్ కాలేజీ నుండి భద్రకాళి రోడ్డు వరకు సీసీ రోడ్డు వేయాలని, 56వ డివిజన్ వడ్డెపల్లి ఫిల్టర్‌బెడ్ సమీపంలో 40 కుటుంబాలకు రోడ్డు సదుపాయం కల్పించాలని వినతిపత్రం అందజేశారు. హన్మకొండ టైలర్ స్ట్రీట్ 4-9-118 ఇంటికి నల్లా లేకున్నా నల్లా బిల్లు వస్తుంది వెంటనే పన్ను తొలగించాలన్నారు. పైడిపల్లిలో 47-5-948 బీ ఇంటి నంబరుకు గతం లో కొలతల ప్రకారం ఇంటి బిల్లు రూ.1728 చెల్లించి ఆరు నెలలు అయినా తర్వాత కొలతల్లో తేడా ఉందని రూ.43,200 అపరాధ రుసుం వేశారన్నారు. అదే విధంగా పైడిపెల్లికి చెందిన గూడూరు లక్ష్మి 47-5-948 సీ ఇంటికి గతంలో రూ.2236 బిల్లు చెల్లిం చామని ఇప్పుడు తప్పుడు కొలతలని రూ.55,900 అపరాధ రుసుం వేశారు. వెంటనే వాటిని రద్దు చేయా లని సంబంధిత ఇంటి యజమానులు వినతిపత్రం అందజేశారు. 61వ డివిజన్ సిద్ధార్థనగర్ పార్క్‌లో 12 జిమ్ పరికరాలు చుట్టూ సిసి బెడ్ వేయాలని అదే విధంగా సిద్ధార్థనగర్ 5 నుండి 6 వీధి వరకు సీసీ రోడ్డు వేయాలని కాలనీవాసులు వినతిపత్రం అందజేశారు. అన్ని విభాగాలకు మొత్తం 65 వినతులు ప్రజావాణికి వచ్చాయని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ రషీద్, ఎస్ఈ సత్యనారాయణ, సిటీ ప్లానర్ వెంకన్న, డీఎఫ్‌వో కిషోర్, తదితరులు పాల్గొన్నారు.