Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ధర్మభిక్షం
నవతెలంగాణ-రఘునాథపల్లి
రఘునాథపల్లి మండలం మేకలగట్టు పరిధి సర్వే నెంబర్-206లో 70 ఎకరాల భూమి ఇటీవల రియల్టర్ల చేతిలో కబ్జాకు గురికాగా తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నదని, ఆ భూమిలో జీఎంఆర్ పాలిటెక్నిక్, ప్రభుత్వ ఐటీఐ కళాశాల ఏర్పాటు చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ధర్మభిక్షం డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలక్టర్కు వినతిపత్రం అందజేసి ఆయన మాట్లాడారు. అన్ని వత్తి విద్యా కోర్సులు, ప్రాక్టికల్ ల్యాబ్ ఏర్పాటు చేసేందుకు సులభంగా ఉంటుందని అన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ భూములు లేవని చిత్రీకరించే ఎమ్మెల్యేలకు అక్కడి భూముల్లో విద్యా సంస్థలు ఏర్పాటు చేయాలనే ఆలోచన రావడం లేదా అని ప్రశ్నించారు. ఎన్నికల హామీ పాలిటెక్నిక్, ఐటీఐ కళాశాల ఏర్పాటును గాలికొదిలేశారని అన్నారు. రియల్టర్లు భూములు కబ్జా చేస్తే టీఆర్ఎస్ ప్రజాపరతినిధులంతా ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. జనగామ అభివద్ధికి ఎలాంటి కషి చేయలేదని అన్నారు. తక్షణమే కళాశాలలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు లవ కుమార్, రమేష్ పాల్గొన్నారు.