Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇప్పగూడెం ఎంపీటీసీ విజయలక్ష్మి
నవతెలంగాణ - స్టేషన్‌ఘన్‌పూర్
'ఇప్పటికీ మూడేండ్లు గడిచింది. ఇప్పటివరకూ... ఏ ఒక్క సారైనా సమావే శాలకు గానీ, ఇతర అభివృద్ధి పనుల నిమి త్తమై సమాచారం అధికారులు ఇవ్వడం లేదు. మండలస్థాయి అధికారులు బాధ్యత గా సమావేశాలకు సమాచారం ఇవ్వరా ?' అని మండలంలోని ఇప్పగూడెం గ్రామ ఎంపీటీసీ గండి విజయలక్ష్మి ప్రశ్నించారు. సోమవారం మండల పరిషత్ కార్యాలయం లో ప్రధాన మంత్రి కిసాన్ సమృద్ధి యోజ న, వాటర్‌షెడ్ డెవలప్మెంట్ 2.0పై అవగా హనా సదస్సు ఏర్పాటు చేశారు. జెడ్పీ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ మారపాక రవి, జిల్లా గ్రామీణాభివద్ధి శాఖ జిల్లా అధికారి గూడూరి రాంరెడ్డి, ఎంపీపీ కందుల రేఖ పాల్గొనగా వారి ఎదుట ఎంపీపటీసీ సమస్యను లేవనెత్తారు. అనంతరం జెడ్పీ స్టాండింగ్ చైర్మన్ రవి మాట్లాడుతూ ఎలాంటి సమావేశాలు నిర్వహించినా కచ్చి తంగా గౌరవ ప్రజాప్రతినిధులకు సమా చారం ఇవ్వాల్సిందేనని చెప్పారు. ఇలాంటి సమస్య పురావృతం కావొద్ధని ఎంపీడీఓ కుమారస్వామికి, ఇతర అధికారులకు సూచించారు. అనంతరం సదస్సును ఉద్దే శించి మాట్లాడుతూ భూగర్భ జలాలను పెంపొందించేందుకు తీసుకోవాల్సిన చర్య లను ప్రజాప్రతిని ధులకు, కిందిస్థాయి అధికారులకు వివరిం చారు. వర్షాల ద్వారా ప్రతి నీటి బొట్టును భూములోకి ఇంకిం పజేసి, వ్యవసా యానికి అనుకూ లంగా మార్చుకో వడమే వాటర్ షెడ్ పథకం ముఖ్యోద్దేశం అన్నారు. దీనిపై రైతులకు అవగాహన కల్పించాలని కోరారు. మండలంలోని 18 గ్రామ పంచాయతీలను సర్వే చేసి ఈ వాటర్ షెడ్ పథకం ప్రవేశ పెడతామని అన్నారు. ఈ పథకాల అమలుకు సుమారు రూ.11కోట్లు మంజూ రైనట్టు తెలిపారు. ఈకార్యక్రమంలో ప్రాజెక్ట్ అధికారి వీరన్న, సర్పంచులు, ఎంపీటీసీలు పంచాయితీ కార్యదర్శులు, తదితర అధికారులు పాల్గొన్నారు.