Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- తొర్రూర్ రూరల్
మండలంలోని వెంకటాపురం సర్పంచ్ శీలం లింగన్నగౌడ్కు జాతీయస్థాయి అవార్డు రావడం అభినందనీయమని ఆర్ఎంపీ, పీఎంపీ మండల అధ్యక్షుడు గొడిశాల నవీన్ అన్నారు. సోమవారం గ్రామీణ వైద్యుల ఆధ్వర్యంలో సర్పంచ్ లింగన్నను ఘనంగా సన్మానించి ఆయన మాట్లాడారు. లింగన్నగౌడ్ ఆర్ఎంపీగా ప్రజలకు వైద్య సేవలందించారన్నారు. సర్పంచ్‌గా గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి జాతీయస్థాయిలో అవార్డు పొందడం గర్వకారణమన్నారు. కరోనా బారిన పడిన వారికి ప్రాథమిక వైద్య సాయం, అవసరార్థులకు నిత్యావసర సరుకులను అందజేసి అందరికీ ఆదర్శంగా నిలిచారన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షుడు జగదీష్, ప్రధాన కార్యదర్శి కళాధర్, కోశాధికారి శంకర్, గౌరవ సలహాదారులు విద్యాసాగర్, మురళి, సారయ్య, నాయకులు కిరణ్, ప్రకాష్, రవీందర్, వెంకటేష్, రవి, వీరపయ్య, రమేష్, కమలాకర్, ఖమ్మం మాక్స్ కేర్ యజమాన్యం డాక్టర్ అభిషేక్, డాక్టర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.