Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బయ్యారం
నకిలీ విత్తనాలను అరికట్టాలని, సకాలంలో ఎరువుల, విత్తనాలు, వడ్డీ లేని రుణాలు అందించాలని కోరుతూ సోమవారం అఖిల భారత రైతుకూలీ సంఘం ఆధ్వర్యంలో స్థానిక తాహసిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి, వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు నందగిరి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ...వ్యవసాయ సీజన్ ప్రారంభమైందని, ప్రైవేటు దళారులు రైతులను నమ్మించి నకిలీ విత్తనాలచ్చిమోసాలకు పాల్పడుతున్నారని ఆయన విమర్శించారు. అంతే కాకుండా వ్యాపారస్తులు ఎరువులు, విత్తనాలు ఎమ్మార్పి ధరలతో సంబంధం లేకుండా వారియిష్ణానుసారంగా అధిక రేట్లక అమ్ముతున్న అదికారులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తూ, చేతులు దులుపుకొంటన్నారని విమర్శిం చారు. తక్షణమే సకాలంలో ప్రభుత్వంమే ఎరువులు, విత్తనాలు సరఫరా చేయాల ని, రైతాంగానికి వడ్డీలేని రుణాలను అందించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బస్సు, కరెంటు చార్జీలు, గ్యాస్ ధరలు పెంచి ప్రజల పై అధికభారం మోపిందని వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు తోకల వెంకన్న, వల్లాల బిక్షం, జగన్నాథం, భాష తదితరులు పాల్గొన్నారు.