Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కేసముద్రం రూరల్
కేసముద్రం మండలం నారాయణపురం గ్రామ రైతులకు పట్టాలను ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సోమవారం స్థానిక తాసిల్దార్ కార్యాలయంలో చేపట్టనున్న రిలే నిరాహార దీక్షకు తరలివెళుతున్న రైతులను పోలీసులు,రెవెన్యూ అధికారులు అడ్డగించి రైతులతో చర్చకు దిగారు. ఈ నేపథ్యంలో నారాయ ణపురం గ్రామ రైతుల సమస్యలపై ఎంపీటీసీ ధరావత్ రవి అధికారులకు వివరించారు. ధరణిలో పాసుబుక్ డేటా కరెక్షన్లో దరఖాస్తు చేసుకున్న 149,150,154,165,166,168 సర్వేనెంబర్ని రైతులకు 1403 ఎకరాలకు వెంటనే పాస్ పుస్తకాలను జారీ చేయాలన్నారు. 5 జనవరి 2005లో అటవీ క్లియరెన్స్ ఇచ్చిన సర్వే నెంబర్లు 116,117,151,152,153,155 నుండి 164,167సర్వేనెంబర్లో మొత్తం 202 ఎకరాలకు ఎంజారు మెంట్ సర్వే చేసి పట్టాదార్ పాస్ పుస్తకాలను ఇవ్వాలని తెలిపారు. 222 ఎకరాల పట్టా భూములకు ఎంజారు మెంట్ సర్వే నివేదిక ప్రకటించి వారికి పాస్ పుస్తకాలను ఇవ్వాలని పేర్కొన్నారు. 1403 ఎకరాలకు ఎంజారు మెంట్ సర్వే చేసేటప్పుడు గతంలో 165వ సర్వే నెంబర్లో 60 సంవత్సరాల నుండి సాగులో ఉండి, పట్టా దారు కలిగివున్న 150 ఎకరాలకు అవుట్ ఆఫ్ బౌండరీ అని వదిలి పెట్టారని వాటికి సర్వే నంబర్లను గుర్తించి పట్టాదార్ పాస్ పుస్తకాలను ఇవ్వాలని కోరారు. సానుకూలంగా స్పందించిన రెవెన్యూ అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి త్వరలోనే రైతులకు న్యాయం చేస్తామని, నూతన పట్టాదారు పాసు పుస్తకాలను ఇస్తామని భరోసా ఇచ్చినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లక్ష్మీపతి,వూకంటి యాకూబ్‌రెడ్డి, తహసీల్ధార్ ఫరీదుద్దీన్, డిప్యూటీ తహసీల్దార్ కోమల, నారాయణ పురం రైతులు తదితరులు పాల్గొన్నారు.