Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కరోనా నిబంధనలు పాటించాల్సిందే
- అన్ని పీహెచ్‌సీల్లో అందుబాటులో ఔషధాలు
- నవతెలంగాణతో డీఎంహెచ్ఓ హరీష్ రాజ్
నవతెలంగాణ-మహబూబాబాద్
'వర్షాకాలంలో ప్రబలే సీజనల్ జ్వరాలను నివారించేందుకు వైద్యారోగ్యశాఖ సర్వం సిద్ధంగా ఉంది. అన్ని పీహెచ్‌సీల్లో ఔషధాలు అందుబాటులో ఉన్నాయి. వర్షాకాలం సీజన్లో మురుగు నీరు నిల్వ ఉండకుండా, దోమలు వృద్ధి చెందకుండా, గ్రామాల్లో విష జ్వరాలు ప్రబలకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నాం. మహబూబాబాద్ జిల్లాలో సీజనల్ వ్యాధుల నివారణకు టాస్క్‌ఫోర్స్ మీటింగ్ కూడా నిర్వహించాం.' అని మహబూబాబాద్ డీఎంహెచ్ఓ హరీష్ రాజ్ నవతెలంగాణతో వెల్లడించారు.
మహబూబాబాద్ జిల్లావ్యాప్తంగా మురుగు నీరు నిల్వలు ఉండకుండా ఎప్పటికప్పుడు తొలగించేలా గ్రామ పంచాయతీ అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించి చర్యలు తీసుకుంటున్నామనిడీఎంహెచ్ఓ తెలిపారు. యాంటీ లార్వా ప్రణాళిక చేపట్టి దోమల నివారణకు మత్స్య శాఖ గన్ బూసియా చేపలను పెంచుతున్నామని తెలిపారు. మురుగు నీటి గుంటలత్లో ఆయిల్ బాల్స్ వేస్తున్నట్లు తెలిపారు. గతంలో దోమల నివారణకు 18వేల దోమతెరలు పంపిణీ చేశామని, వాటిని ప్రజలు వినియో గించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గ్రామ పంచాయ తీల ఆధ్వర్యంలో ఫాగింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి పీహెచ్సీ పరిధి సబ్ సెంటర్లలో వైద్యారోగ్య సిబ్బంది ఆధ్వర్యంలో ఫీవర్ సర్వే చేస్తున్నట్లు తెలిపారు. మలేరియా, డెంగ్యూ లక్షణాలుంటే వారి రక్త నమూనాలు సేకరిస్తామని, పాజిటివ్ నమోదైతే పరిసర 50 గహాల్లో కూడా రక్త నమూనాలు సేకరిస్తామని తెలిపారు. జిల్లాలో డెంగ్యూ కేసులు లేవని, ప్రజలు భయాందోళనకు గురి కావొద్దని సూచించారు. ఎలిసా టెస్ట్ పాజిటివ్ వస్తేనే డెంగ్యూ గా పరిగణిం చాలన్నారు. ప్రజలు పరిశుద్ధమైన తాగు నీటిని వేడి చేసుకుని చల్లార్చిన తరువాతే తాగాలని సూచించారు. మురుగు నీరు నిల్వ ఉండకుండా బావులు, బోరుబావుల చుట్టూ సిమెంట్ ప్లాట్‌ఫాÛరాలు నిర్మిస్తున్నట్టు తెలిపారు. జిల్లాలో కోవిడ్ పరిహారం కోసం 740 దరఖాస్తులు ఆమోదం పొంది నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు పాటించాలని, విధిగా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని డీఎంహెచ్ఓ జిల్లా ప్రజలకు సూచించారు.