Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చిట్యాల
నేరాల నియంత్రణకు నిఘా కెమెరాలు దోహదపడతాయని ఎస్సై గుర్రం కష్ణప్రసాద్ తెలిపారు. మండలంలోని భావుసింగ్పల్లిలో చిట్యాల పోలీసుల ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఎస్సై మాట్లాడారు. గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవటం వల్ల అనేక లాభాలున్నాయని తెలిపారు. నేరాలు తగ్గుముఖం పడతాయని చెప్పారు. అవాంఛనీయ సంఘటన జరిగితే వెంటనే నేరస్తులను గుర్తించవచ్చని తెలిపారు. అన్ని గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడానికి గ్రామస్తులు ముందుకు రావాలని సూచించారు. అనంతరం గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు కోసం కమిటీని ఎన్నుకున్నారు. గ్రామస్తులు కెమెరాల ఏర్పాటు కోసం రూ.40 వేలు చందా అందించారు. కార్యక్రమంలో సర్పంచ్ నారాయణరావు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.