Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సెప్టెంబర్‌లో రథయాత్ర
- సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్
నవతెలంగాణ-హన్మకొండ
గోల్కొండ కోటపై బీసీ జెండాను ఎగరేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆకాంక్షించారు. హన్మకొండలోనిసంఘం కార్యాలయంలో వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన ముఖ్యకార్యకర్తల సమావేశానికి ముఖ్యఅతిధిగా శ్రీనివాస్ గౌడ్ హాజరై మాట్లాడారు. జనాభాలో 60 శాతంగా ఉన్న బీసీలకు ఇప్పటివరకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాన్ని రాజకీయ పార్టీలు కల్పించలేదని చెప్పారు. రాష్ట్రంలోని బీసీలు రాజకీయ పార్టీలను పక్కనపెట్టి బీసీ హక్కుల కోసం పోరాడాలని కోరారు. బీసీలను చైతన్యవంతం చేసేలా సెప్టెంబర్‌లో రాష్ట్రవ్యాప్తంగా రథయాత్ర చేపడతామన్నారు. జూలై 3న హన్మకొండ, వరంగల్ జిల్లాల్లో రథయాత్ర సాగుతుందని తెలిపారు. అదే నెల 4న జనగాం జిల్లాల్లో, 10న భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో, 11న మహుబూబాబాద్ జిల్లాల్లో జిల్లా సదస్సులు నిర్వహించి పూర్తి స్థాయి జిల్లా కమిటీలను ఎన్నుకుంటామని చెప్పారు. సమావేశంలో సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బైరి రవికష్ణ, రాష్ట్ర ఉపాధ్యక్షులు దాడి మల్లయ్య యాదవ్, హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్ల సంపత్ కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సబ్బు అనిల్‌కుమార్, గ్రేటర్ అధ్యక్షుడు రాసురి రాజేష్, జిల్లా నాయకులు బత్తని రమేష్, చిర్ర ఉపేందర్, పంజాల జ్ఞానేశ్వర్, తాళ్లపెల్లి రమేష్, గుర్రం వెంకటేష్, గట్టు శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.