Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సోషల్ మీడియాలో వైరల్
- ఎమ్మెల్యే 'చల్లా'కు ఆప్తుడు
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
మహిళతో అసభ్యంగా మాట్లాడిన ఆత్మకూరు అధికార టీఆర్ఎస్ ప్రజాప్రతినిధి సెల్‌ఫోన్ సంభాషణ జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. వరంగల్ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రానికి చెందిన టీఆర్ఎస్ ప్రజాప్రతినిధి మద్యం మత్తులో ఒక మహిళతో చేసిన సెల్‌ఫోన్ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సదరు మహిళను రాత్రి 11 గంటలకు నేరుగా ఫామ్‌కు నైటీపై రమ్మనడమే కాకుండా సీఎం, పీఎంలను సైతం మద్యం మత్తులో తీవ్రంగా దూషించాడు. నా ఫోన్ రికార్డు చేస్తనవా..? బ్లాక్ మెయిల్ చేస్తవా..? చేస్తే నా మాటలను హైజాక్ చేసిండ్రంట.. మిమిక్రీ చేసిండ్రంట' అంటూ తన ఆడియో కాల్ లీకైతే ఏం చేయనున్నాడో కూడా ముందే చెప్పేయ్యడం కొసమెరుపు.
అధికార టీఆర్ఎస్ ప్రజాప్రతినిధి మద్యం మత్తులో ఒక మహిళతో చేసిన సంభాషణ సోషల్ మీడియాలో హల్చల్ సృష్టిస్తుంది. వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గం ఆత్మకూరు మండల కేంద్రానికి చెందిన టిఆర్ఎస్ ప్రజాప్రతినిధి ఒక మహిళతో మద్యం మత్తులో పచ్చి బూతులు మాట్లాడడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ ఆడియో సంభాషణ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికి అత్యంత ఆప్తుడైన సదరు ప్రజాప్రతినిధి సీఎంను, పీఎంను సైతం 'గాడు' అంటూ దూషించాడు. ఈ ఆడియో సంభాషణతో సదరు టిఆర్ఎస్ ప్రజాప్రతి అక్రమ సంబంధాలు ఎలా వున్నాయో బహిర్గతమవుతుంది. సదరు మహిళను రెండు బీర్లు తాగు అంటూ మాట్లాడాడు. రాత్రి 11 గంటలకు ఫామ్ వద్దకు నైటీమీద రా.. చీరెలు వద్దు.. అంటూ సూచించాడు. ఫామ్‌ల పరుపులున్నరు అంటూ హుషారుగా మాట్లాడాడు. మద్యం మత్తులో ప్రజాప్రతినిధి మాట్లాడుతుంటే అవతల నుండి ఒక మహిళ నవ్వుతూ మాట్లాడుతుంది. ఈ ఆడియో లీక్ కావడంతో టిఆర్ఎస్ పార్టీలోనే కాకుండా జిల్లావ్యాప్తంగా ఈ ఆడియో సంభాషణ ప్రకంపనలు సృష్టిస్తుంది.
ఎమ్మెల్యే 'చల్లా'కు ఆప్తుడు
ఒక మహిళతో ఆడియో సంభాషణ చేసిన ఆత్మకూరు మండలకేంద్రానికి చెందిన టీఆర్ఎస్ ప్రజాప్రతినిధి పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికి అత్యంత ఆప్తుడు కావడం గమనార్హం. సంక్షేమ పథకాలలో మహిళలను ఎంపిక చేస్తూ సదరు మహిళలను లొంగతీసుకుంటున్నట్లు ఈ టిఆర్ఎస్ ప్రజాప్రతినిధిపై ఆరోపణలున్నాయి. ఈ ఆడియో సంభాషణ కూడా పాతదేనని తెలుస్తుంది. ఏదేమైనా ఒక గౌరవప్రదమైన పదవిలో వున్న టిఆర్ఎస్ నేత ఇంత దిగజారి మహిళతో అసభ్యంగా, పచ్చి బూతులతో మాట్లాడుతుండడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇంత కలకలం సృష్టిస్తున్న ఈ ఆడియో సంభాషణ చేసిన టిఆర్ఎస్ ప్రజాప్రతినిధిపై పార్టీపరంగానే కాకుండా చట్టరీత్యా చర్యలు తీసుకుంటారా ? లేక మనోడేనని వదిలేస్తారో మరీ.