Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - స్టేషన్‌ఘన్‌పూర్
గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల అభివద్ధి కోసం ప్రభుత్వం 'మన ఊరు-మనబడి' ప్రవేశపెట్టిందని సర్పంచుల ఫోరం చిల్పూర్ మండల అధ్య క్షుడు, చిన్నపెండ్యాల సర్పంచ్ మామిడాల లింగారెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని చిన్నపెండ్యాల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో పాఠ్య పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం ఎంతగానో కషి చేస్తు న్నదన్నారు. విద్యాభివద్ధి కోసం పభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. ఇంగ్లీష్ మీడి యంలో బోధన పద్ధతులు గొప్ప విషయమన్నారు. తెలంగాణ ప్రభుత్వం అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు. అన్ని గ్రామాల్లో సీసీరోడ్లు, రహదారులను నిర్మిస్తూ భారీగా అభివద్ధి పనులు చేపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు పి రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు.