Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- తొర్రూర్ రూరల్
వర్షపు నీటిని ఒడిసిపట్టి వధా నీటికి అడ్డుకట్ట వేసి భూగర్భ జలాలను పెంపొందించుకోవడమే జల శక్తి అభి యాన్ లక్ష్యమని మ్యాన్ పవర్ ఎంపవర్మెంట్ అండ్ డిసేబులిటీ డిపార్ట్మెంట్ కేంద్ర డైరెక్టర్ కె మోహన్, కేంద్ర నీటి విద్యుత్, పరిశోధన సంస్థ శాస్త్రవేత్త జీవీఆర్ మూర్తి అన్నారు. మంగళవారం తొర్రూరు మండలం కంఠాయపాలెం గ్రామంలో జిల్లా అధికారులు ప్రజాప్రతి నిధులతో కలిసి కుంటలు, చెరువులు, చేపల చెరువులు, ఇంకుడు గుంతలు పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ జల శక్తి అభి యాన్ పనులకు జియో టాగింగ్ చేయాలన్నారు. జెడ్పీ ఫ్లోర్ లీడర్, జెడ్పీటీసీ శ్రీనివాస్ మాట్లాడుతూ... ఉపాధి హామీ పనుల ద్వారా జలశక్తి అభియాన్ పనులు, రాష్ట్ర ప్రభుత్వం హరితహారం ద్వారా భూగర్భ జలాలు పెం పొందించేందుకు కృషి చేస్తున్నాయన్నారు. అనంతరం తొర్రూర్ ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన ఇంకుడు గుంతను పరిశీలించారు. సర్పంచ్ శ్రీపాల్ రెడ్డి, ఎంపసీటీసీ దేవమ్మ, ఉపసర్పంచ్ రామ్మూర్తి, డీఆర్డీఓ సన్యాసయ్య, జిల్లా వ్యవసాయ అధికారి చత్రు నాయక్, వ్యవసాయ అధికారి కుమార్ యాదవ్, ఏపీడీ దయాకర్, ఇరిగేషన్ ఈఈ, డీఈ సునిల్‌కుమార్, ఎంపీడీఓ సింగారపు కుమార్, ఎంపీఓ ఎండీ గౌస్, ఏపీఓ పార్థసారధి పాల్గొన్నారు.