Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు
నవతెలంగాణ-మల్హర్రావు
భారత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు తీసుకొచ్చిన సంస్కరణలే దేశ ప్రగతికి మూలంగా నిలిచాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. పీవీ నర్సింహారావు జయంతి సందర్భంగా మండల కేంద్రంలో ఆయన చిత్రపటానికి శ్రీధర్‌బాబు మంగళవారం పూలమాల వేసి నివాళ్లర్పించి మాట్లాడారు. పీవీ నర్సింహారావు, ఎమ్మెల్యేగా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, ప్రధానిగా దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించారని కొనియాడారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.