Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - చిన్నగూడూరు
సమయపాలన పాటించని ఎస్సీ హాస్టల్ వార్డెన్ రవికుమార్‌పై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు పట్ల మధు డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట విద్యార్థులతో కలిసి ధర్నా చేపట్టారు. అనంతరం తహ సీల్ధార్ రామకష్ణరావుకు వినతిపత్రం అందజేసి ఆయన మాట్లాడారు. హాస్టల్ పునర్ ప్రారంభమై రోజులు గడుస్తున్నా మెనూ అమలు చేయకపోవడం బాధాకరమన్నారు. విద్యార్థులకు నోట్ బుక్స్ ఇవ్వకుండా అమ్ముకుంటున్నారని అన్నారు. వసతి గహంపై అధికారులు కన్నెత్తి చూడకపోవడం దారుణమన్నారు. మోను ప్రకారం పెట్టమని అడిగితే విద్యార్థులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు. తక్షణమే వార్డెన్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి గందసిరి జ్యోతిబసు, డివిజన్ నాయకులు మురళి, రాజేష్, నవీన్ విద్యార్థులు మహేష్, ప్రవీణ్ ,ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు.