Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతలెంగాణ-కేసముద్రం
మండలం లోని అర్పణపల్లి గ్రామానికి పోస్ట్ ఆఫీస్ లేదని, పింఛన్ దారులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతు న్నారని పోస్టాఫీస్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని గ్రామ సర్పంచ్ గంధసిరి స్వరూప కోరారు. మంగళ వారం పింఛనుదారులతో కలిసి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన సర్పంచ్ మాట్లాడుతూ... ఐదు రోజులు గడుస్తున్నా పింఛన్లకోసం సమీప గ్రామ పోస్ట్ ఆఫీస్ కు వెళ్లాల్సి వస్తోందన్నారు. అక్కడ పింఛను అందించడం లో జాప్యం జరుగుతోందన్నారు. వెంటనే పోస్టాఫీస్ ఏర్పాటు చేయాలన్నారు.