Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బయ్యారం
ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతి ఒక్కరూ ప్రతిఘటించాలని తెలంగాణ టైల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.కె మదార్, యూనియన్ వర్కింగ్ ప్రసిడెంట్ బి. రాంసింగ్ అన్నారు. కార్మిక కార్మికవర్గ సమస్యల పరిష్కారానికి జులై 7న హైదరాబాద్లో మహాధర్నా సందర్భంగా ఐఎఫ్టీయూ రాష్ట్ర కమిటి పిలుపులో భాగంగా మంగళవారం మండలంలోని షేడ్వెల్, సాంబశివ, మాతావైష్ణవి, పూర్ణా, విజయలక్ష్మి టైల్స్ ఫ్యాక్టరీలలో ధర్నా పోస్టర్ ఆవిష్కరించారు. చలో హైదరాబాద్ మహాధర్నాను విజయవంతం చేయాలని ప్రచారం చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక విధానాల వల్ల కార్మికుల భవిష్యత్తు అస్తవ్యస్తంగా మారిందన్నారు. బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 44 కార్మిక చట్టాలను 4 కోడులుగా చేసి, కార్పోరేట్ శక్తులకు అనుకూలంగా కార్మిక చట్టాలను తీసుకొచ్చిందన్నారు. అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లోకి నూరు శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు చట్టబద్ద అవకాశం కల్పించిందని తెలిపారు. కనీస వేతానాల పెంపు, ప్రజారంగ ఆస్తుల పరిరక్షణ, షెడ్యూల్డు పరిశ్రమల కనీస వేతన జీవోల విడుదల ఆర్టీసీ సంస్థ పరిరక్షణ, అధిక ధరల నియంత్రణ, కాంట్రాక్ట్ కార్మికుల పర్మినెంట్, హమాలీ, బీడీ, నిర్మాణరంగం, స్కీమ్ వర్కర్ల సమస్యల పరిష్కారానికి నిర్వహించే చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు శ్రీరాములు, రమాదేవి, ఆదినారాయ, పాషా, స్వరూప, ప్రదీప్, లింగయ్య, సంక, సాంబ, సీత, శంకర్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.