Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పాలకుర్తి
విద్యాసంవత్సరం ప్రారంభమైన సందర్భంగా ప్రభుత్వ ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు వెంటనే చేపట్టాలని టీఎస్ యూటీఎఫ్ జిల్లా కార్యదర్శులు వీరమల్ల బాబయ్య, చిక్కుడు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మంగళవారం టీఎస్ యూటీఎఫ్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. తహసీల్ధార్ భూక్య పాల్‌సింగ్ నాయక్‌కు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భం గా మండల అధ్యక్షుడు దోకురు రాములుతో కలిసి వారు మాట్లాడుతూ.. విద్యా రంగ సమస్యలు పరిష్కరించాలని, డీఎస్సీ నిర్వహించి ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అన్ని పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలని, విద్యా ర్థులకు సకాలంలో పుస్తకాలు, యూనిఫామ్‌లు అందజే యాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీఎస్ యూటీఎఫ్ పాలకుర్తి ప్రధాన కార్యదర్శి చిదురాల రమేష్, గుగులోత్ బలరాం నాయక్, బల్గుల ఉప్పలయ్య, గంధసిరి ప్రసాద్, విజయ రాణి, హేమలత, సునీత, వంగ నాగరాజు, షాగ నర్సయ్య, కూటికంటి శ్రీనివాస్, చిట్యాల యాదగిరి, విష్ణుమూర్తి, రత్నకుమారి,కవిత, రమాదేవి, రాంప్రసాద్, సి ఆర్ పి విజరు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.