Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి
నవతెలంగాణ-జనగామ
ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి జనగామ నియోజక వర్గ అభివృద్ధి జరుగుతుందని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎమ్మెల్సీ పాల్గొని మాట్లాడారు. నియో జకవర్గంలో ఎమ్మెల్యేకు మంచి ప్రజాదరణ ఉందన్నారు. రాబోయే ఎన్నికల్లో ఆయన గెలుపునకు సహకారం ఉంటుం దన్నారు. జనగామ ఎమ్మెల్యే టికెట్ రేసులో తాను ఉన్నట్లు వస్తున్న దుష్ప్రచారంలో నిజం లేదని తెలిపారు.
నాటి తెలంగాణ ఉద్యమంతోపాటు జిల్లా పోరాటం వరకు ముత్తిరెడ్డి జనగామ ప్రజలతో మమేకమై ఉన్నాడని అన్నారు. ఎనిమిదేండ్లలో సైతం ఈ ప్రాంత అభివద్ధికి ముత్తిరెడ్డి కృషి మరువలేనిదన్నారు. హైదరాబాద్‌లో జులై 2, 3 వ తేదీల్లో జరిగే బీజేపీ జాతీయ సమావేశాలకు వచ్చే ఆ పార్టీ ముఖ్య నాయకులు, ఆయా రాష్ట్రాల సీఎంలను టూరిస్టులుగా భావి స్తున్నామన్నారు. తెలంగాణలో జరుగుతున్న సంక్షేమం, అభివద్ధి కార్యక్రమాలను బీజేపీ కంద్ర మంత్రులు, సీఎంలు, నాయకులు జిల్లాల వారిగా పర్యటించి ఆయా రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేసుకోవాలని హితవు పలికారు. సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించి.. జాతీయ రాజకీయాల్లో ముఖ్య భూమిక పోషిస్తున్నారని ఆందోళన చెందిన బీజేపీ హైదరాబాద్ వేదికగా కార్యక్రమాలను నిర్వ హిస్తుందని ఎద్దేవా చేశారు. అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌ను చూసి బీజేపీ బుద్ధి తెచ్చుకోవాలన్నారు. అగ్నిపథ్ కార్యక్రమం రద్దు చేయాలని సికింద్రాబాద్ అల్లర్ల కాల్పుల్లో మృతి చెందిన దామెర రాకేష్ కుటుంబాన్ని పరామర్శించి కాంగ్రెస్ నాయకులు సత్యాగ్రహం పేరిట ధర్నాలు చేయడం సిగ్గుమాలిన పని అన్నారు. ఈ సమావేశంలో వికలాంగుల సంస్థ రాష్ట్ర చైర్మన్ వాసుదేవ రెడ్డి, రైతు సమన్వయ సమితి జిల్లా కన్వీనర్ రమణ రెడ్డి, జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ విజయ సిద్ధులు, జనగామ మున్సిపల్ చైర్ పర్సన్ పోకల జమున, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.