Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వర్ధన్నపేట ఏసీపీ రమేష్
నవతెలంగాణ-పాలకుర్తి
నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు దోహదపడతాయని వర్ధన్నపేట ఏసీపీ గొల్ల రమేష్ అన్నారు. మంగళవారం మండలం లోని పెద్దతండ(కె) పంచాయతీలో గ్రామపం చాయతీ, ప్రజల భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పాలకుర్తి సీఐ వట్టే చేరాలు, ఎస్ఐ తాళ్ల శ్రీకాంత్, సర్పంచ్ లావుడియా శాంతమ్మతో కలిసి ఆయన ప్రారంభించి మాట్లాడారు. సీసీ కెమెరాలు గ్రామానికి రక్షణ కవచాలుగా ఉపయోగపడ తాయని తెలిపారు. సీసీ కెమెరాల ఏర్పాటు లో గ్రామపంచాయతీతోపాటు ప్రజల భాగ స్వామ్యం అభినందనీయమన్నారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగ కుండా ప్రజలు ఎలాంటి గొడవలకు పాల్ప డకుండా నివారించేందుకు సీసీ కెమెరాలు ఉపయోగపడతాయని తెలిపారు. గ్రామంలో అపరిచితులు సంచరిస్తే సీసీ కెమెరాల ద్వారా గుర్తించి చర్యలు తీసుకుంటామని, ప్రమాదా లను నివారించేందుకు సీసీ కెమెరాలు ఉపయోగపడతాయన్నారు. ఈ కార్యక్రమం లో కొడకండ్ల మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ లావుడియా దేవానాయక్, ఉపసర్పంచ్ బాదావత్ వలిమియా, వార్డు సభ్యులు గుగులోతు వినోద, ధరావత్ యాకూబ్, బానోతు లలిత, గ్రామస్తులు పాల్గొన్నారు.