Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోడు భూముల రక్షణ కోసం పోరాడాల్సిందే
- ములుగు ఎమ్మెల్యే సీతక్క
నవతెలంగాణ-కొత్తగూడ
ఏజెన్సీలో కూర్చొని పోడు సమస్యలు పరిష్కరిస్తామని ఇచ్చిన హామీ ఎటుపోయిందని వీలైతే ఏజెన్సీ లో మహారాజ కుర్చీ వేస్తాం వచ్చి పోడు సమస్యలు పరిష్కరించాలని ములుగు ఎమ్మెల్యే ధనసరి సీతక్క అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించి తహసీల్దార్, రేంజ్ ఆఫీసర్ లకు మెమోరాండం అందచేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోడు భూములకు హక్కు పత్రాలు ఇస్తామని దరఖాస్తులు స్వీకరించి నేటికి లబ్ధిదారులకు హక్కు పత్రాలు ఇవ్వకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం సరైంది కాదన్నారు. అటవీశాఖ అధికా రులు గ్రామలకు తారు రోడ్లు వేయని యకుండా అడ్డుకుంటు న్నారని విమర్శిం చారు. వ్యవసాయ భూములను హరిత హారం పేరుతో ఫారెస్ట్ అధికారులు అక్ర మంగా కంధకాలు తీస్తూ మొక్కలు నాటే కార్యక్రమాన్ని విరమించక పోతే ప్రజా పోరాటాలు ఉదతం చేస్తామని హెచ్చరిం చారు. పోడు భూముల రక్షణ కోసం పోరాడాల్సిందేనని పిలుపునిచ్చా రు .కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాయ మాటలు చెప్పడం కాదు ప్రజాసమస్యలను పరిష్కరించి చూపాలని సవాల్ విసిరారు. ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వజ్జ సారయ్య, రాష్ట్ర నాయ కులు కుచనా రవళి, చల్లా నారాయణరెడ్డి, ఎంపీపీ బాణోత్ విజయ రూప్ సింగ్, జడ్పీటీసీ పుష్పలత, వైస్ ఎంపీపీ కాడ బోయిన జంపయ్య, వర్కింగ్ సుంకరబోయిన మోగిళి,పెనుక పురుషోత్తం, మధు సూదన్ రెడ్డి, సయ్యద్, ఉళ్లేంగుల రమేష్, సర్పంచ్ లు, ఎంపీటీసీ లు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.