Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-స్టేషన్ ఘన్పూర్
అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాలని యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కీసర దిలీప్‌రెడ్డి డిమాండ్ చేశారు. మండలంలోని శివునిపల్లిలో అంబేద్కర్ విగ్రహం ఎదుట నాయకులు బస్వగాని అనిల్ గౌడ్ ఆధ్వర్యంలో అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా శుక్రవారం శాంతియుత సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా దిలీప్‌రెడ్డి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరి వల్లే దేశ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అగ్నిపథ్ వల్ల రక్షణ రంగం నిర్వీర్యమయ్యే ప్రమాదం ఉందన్నారు. కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు శివరాజ్ యాదవ్, వినోద్, ఉపాధ్యక్షుడు నీలం యువరాజ్, తాటి కాయల రాజేందర్, ఐలపాక శ్రీను, మారపాక వసంత్, నీల రాకేష్, నాగబండి సంతోష్, సంపత్, పద్వి, విక్రమ్, రాజేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.