Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హన్మకొండ
జాతీయ విద్యా పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించాలని యూటీఎఫ్ హనుమకొండ, వరంగల్ జిల్లాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి తాటికాయల కుమార్, బద్దం వెంకట్రెడ్డి, పెండెం రాజు డిమాండ్ చేశారు. ఆ యూనియన్ హనుమకొండ, వరంగల్ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో హనుమకొండలోని ఏకాశిల పార్కు వద్ద శుక్రవారం ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కుమార్, వెంకట్రెడ్డి, రాజు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేయనున్న జాతీయ విద్యా పథకం వల్ల విద్యారంగానికి నష్టం వాటిల్లనుందని చెప్పారు. సీపీఎస్ రద్దు కోసం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని, పీఎఫ్ఆర్డీఏ చట్టం రద్దు కోసం కేంద్ర ప్రభుత్వం కృషి చేయాలని, విద్యారంగంలోని ఉద్యోగ ఖాళీలన్నిటినీ భర్తీ చేయాలని, కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని, ఇతర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అనంతరం హనుమకొండ, వరంగల్ కలెక్టర్లకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ సభ్యురాలు మర్రి అన్నాదేవి, జిల్లా ఉపాధ్యక్షులు సమ్మక్క, సదాశివరెడ్డి, మేకిరి దామోదర్, డాక్టర్ విద్యాదేవి, కోశాధికారి సుజన్ ప్రసాదరావు, కిరణ్ కుమార్, జిల్లా కార్యదర్శి వెంకటేశ్వర్రావు, శ్రీనివాస్, భాస్కర్, టీవీ సత్యనారాయణ, లోకేష్, శ్రీనివాస్, గట్టు శ్రీనివాస్, లింగారావు, నిజాముద్దీన్, తదితరులు పాల్గొన్నారు.