Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రముఖ వైద్యుడు డాక్టర్ నమిలికొండ పాంచాల్ రారు
- మాస్టర్జీ వికాస్ హైస్కూల్లో వేడుకగా డాక్టర్స్ డే
నవతెలంగాణ-హనుమకొండ చౌరస్తా
సరైన ఆహార అలవాట్ల వల్లే ఆరోగ్యం బాగుంటుందని ప్రముఖ వైద్యుడు డాక్టర్ నమిలికొండ పాంచాల్ రారు స్పష్టం చేశారు. హనుమకొండ రెడ్డీకాలనీలోని మాస్టర్జీ వికాస్ హైస్కూల్లో డాక్టర్స్ డే కార్యక్రమాన్ని శుక్రవారం వేడుకగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ పాంచాల్ రారు విద్యార్థులను ఉద్ధేశించి మాట్లాడారు. విద్యార్థి దశలోనే ఆరోగ్య పరిరక్షణ పట్ల అవగాహన పెంచుకోవాలని సూచించారు. సమాజంలోని ప్రతిఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. ఆరోగ్యం మీద ఆహార అలవాట్లు ప్రభావం చూపుతాయని తెలిపారు. ఆరోగ్యంగా ఉండాలంటే సరైన ఆహార అలవాట్లు ఉండాలని సూచించారు. ఆరోగ్య పరిరక్షణకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. అనంతరం విద్యార్థులు వెలుబుచ్చిన పలు సందేహాలకు సమాధానాలు ఇచ్చారు. సమాజంలో పెరుగుతున్న వ్యాధులను, రుగ్మతలను నిరోధించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చక్కగా వివరించారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజషన్ సూచి ప్రకారం భారత్లో ప్రస్తుతం మధుమేహ వ్యాధి గణనీయంగా పెరుగుతోందని ఆందోళన వెలిబుచ్చారు. విద్యార్థులు, యువత మెరుగైన ఆహార, ఆరోగ్య అలవాట్లను పెంచుకుని మధుమేహాన్ని నిరోధించవచ్చని చెప్పారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రాగి వాణి, ఏఓ కక్కెర్ల నాగరాజు, బోధన, బోధనేతర సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.