Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహబూబాబాద్
మోడీ ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్ యాక్ట్ అమలును నిలిపివేయాలని దేశవ్యాప్తంగా భారత కార్మిక సంఘాల సమైక్య ఆధ్వర్యంలో నిరసన దినం పాటించాలని ఐఎఫ్టి యు జిల్లా అధ్యక్షులు పర్వత కోటేష్ అలావత్ లింగన్న డిమాండ్ చేశారు. పట్టణంలో ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో స్థానిక ఓసి క్లబ్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు నిర సన ర్యాలీ నిర్వహిచారు.కార్యక్రమానుద్దేశించి ఆయన మాట్లాడుతూ మొత్తం 44 కార్మిక చట్టాల్లో 29 చట్టాలను రద్దుచేసి వాటి స్థానంలో నాలుగు చట్టాలను చేసింది వాటిని లేబర్ చట్టాలు కాకుండా లేబర్ కోడ్గా నామకరణం చేశారు.కార్మికుల కోసం చేసిన వాటిని చట్టాలుగా పరిగ ణిం చారు. ఆ పేరు కూడా కార్పొరేట్లకు ఇష్టం లేదు అన్నారు బ డా కార్పొరేట్ల సేవకు అంకితమైన మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాలు అనడానికి కూడా సిద్ధంగా లేదన్నారు. లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా కార్మిక వర్గం గత మూడేళ్లుగా ఆందోళన కొనసా గిస్తుందన్నారు. లేబర్ కోడ్లతో కార్మికులకు తీవ్ర నష్టం జరుగుతుందని, కార్మికుల ప్రయోజనాల కోసం అయినా లేబర్ కోడులను అమలును నిలిపివేయాలని డిమాండ్ చేశారు, కార్యక్రమంలో ఎఫ్టీయూ జిల్లా నాయకులు ఎస్డి నిజా ముద్దీన్, తెలబో యిన కృష్ణ, కొలిపాక ఐలయ్య, అల్లి ఏకాం బరం, వేణు, కళ్యాణ్, పుల్లయ్య సైదులు భరత్ సురేష్ అబ్రహం మేఘ్య, షాబుద్దీన్, వెంకన్న, ఉప్పలయ్య, ఆరుద్ర శ్రీనివాస్ మల్లేష్ పాల్గొన్నారు.