Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జూన్ ఉత్పత్తి 67 శాతం, రవాణా 66 శాతం
- ఏరియా జీఎం మల్లెల సుబ్బారావు
నవతెలంగాణ-కోల్బెల్ట్
భూపాలపల్లి ఏరియాలో ఉత్పత్తి పెరుగుదలకు ఉద్యోగులంతా సమిష్టిగా కషి చేయాలని, ఎస్డిఎల్ యంత్రాల పని గంటలను పెంచాలని ఏరియా జనరల్ మేనేజర్ మల్లెల సుబ్బారావు అన్నారు. జిల్లా కేంద్రంలోని జీఎం కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జూన్ నెల ఏరియా ఉత్పత్తి లక్ష్యం 2.99 లక్షల టన్నులు కాగా 2.02 లక్షల టన్నులతో 67% ఉత్పత్తి, 66శాతం రవాణా సాధించడం జరిగిందని, కేటీకే -1 లక్ష్యం 27,000 టన్నులకు గాను 70 శాతం, కే టి కే -5 లక్ష్యం 34 వేల టన్నుల గాను 54 శాతం, కే టి కే -6 లక్ష్యం 20,000 టన్నులకు గాను 63 శాతం, కేటికె -8 లక్ష్యం 43,000 టన్నులకు గాను 34 శాతం, కేటీకే ఓసి-2 లక్ష్యం 75,000 టన్నులకు గాను 109 శాతం, కేటీకే ఓసి- 3 లక్ష్యం 1,00,000 టన్నులకు గాను 55 శాతం ఉత్పత్తి సాధించిందని వివరించారు. జూలై నెల ఉత్పత్తి లక్ష్యం 2.99 లక్షల టన్నులు, రవాణా 2.99 లక్షల టన్నులు ఉందని తెలిపారు. ఉత్పత్తి పెంపుకు ఉద్యోగుల గైర్హాజర్ శాతం తగ్గించాలని, రక్షణతో కూడిన ఉత్పత్తిని సాధించాలని అధికారులను ఆదేశించారు. కారుణ్య నియామకాలు జాప్యం లేకుండా చేపట్టాలని, డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ దరఖాస్తులను వెంటనే పరిశీలించి పరిష్కరిస్తున్నామని, పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు వివిధ భద్రతా స్కీములు ద్వారా వచ్చే డబ్బును త్వరితగతిన అందించడానికి కషి చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఏజీఎం జ్యోతి, ఏరియా అధికార ప్రతినిధి అజ్మీరా తుకారాం, ఫైనాన్స్ మేనేజర్ అనురాధ, సీనియర్ పీఓ శ్యాం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.