Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సిపిఐ(ఎం) ములుగు జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకటరెడ్డి
నవ తెలంగాణ-గోవిందరావుపేట
పుల్యాల వసంత అక్రమ పట్టాను వెంటనే రద్దు చేయాలని సిపిఐ(ఎం) ములుగు జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకటరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం మండలంలోని పసరలో అంబాల పోశాలు అధ్యక్షతన ఇండ్ల స్థలాల పోరాట కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ పసర నాగారం రెవెన్యూ శివారులో సర్వేనెంబర్ 109 లో 22 మంది రైతులు కాస్తు కబ్జాలో ఉన్న దీన్ని పరిశీలిం చకుండా అక్రమంగా పుల్యాల వసంతకు ఏజెన్సీ ఏరియాలో చట్టాలకు విరుద్ధంగా 40 ఎకరాల తరి భూమిని రెవెన్యూ అధికారులు లంచాలకు ఆశ పడి అక్రమంగా పట్టా చేశార న్నారు. ఈ పట్టాను రద్దు చేయాలని గతంలో కలెక్టర్కు విన్నవించిన రద్దు చేయలేదని వెంటనే అక్రమ పట్టాను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అదే ప్రకారంగా సర్వే నెంబర్ 109 /ఈ / ఆలో అక్రమంగా కొమురెల్లి జనార్ధన్ కాస్తులో ఉన్నాడని వెంటనే రెవెన్యూ అధికారులు జనార్ధన తొలగిం చాలని డిమాండ్ చేశారు. ఈ సర్వే నెంబర్లు గతంలో 109 /సి, 109/ ఈ లో 60 ఎకరాలకు కు గిరిజనులకు పట్టాలి చ్చారన్నారు. ఇది ప్రభుత్వ భూమి. ఈ భూమిని ఇద్దరు భూస్వాములు తమదంటే తమదేనని 50 సంవ త్సరాలు నుండి కోర్టు చుట్టూ తిరుగుతున్నారని వెంటనే 109 సర్వేనెంబర్ భూమిని సమగ్ర విచారణ జరిపి గ్రామం లో పేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశా రు. ఈ సమస్యలపై జూలై 4న కలెక్టర్ కార్యాలయం ముం దు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు పొదిళ్ల చిట్టిబాబు, కే సూర్యనారాయణ, గొంది రాజేష్, రాజు, రమేష్, రాజేశ్వరి, సువర్ణ తదితరులు పాల్గొన్నారు.